Monday, May 6, 2024

ధర్మం – మర్మం : వై శాఖమాస వైభవం 11 (ఆడియోతో…)

అదత్త్వోదక కుంభంచ చాతకో జాయతేభువి
యోదద్యాత్‌ శీతలంతోయం తృషార్తాయ మహాత్మనే
తావన్మాత్రేణ రాజేంద్ర రాజసూయా యుతం లభేత్‌
ఘర్మశ్రమార్త విప్రాయా వీజయేత్‌ వ్యజనేనయ:
తావన్మాత్రేణ విహగాధి పతిర్భవేత్‌

వైశాఖమాసమున ఒక్కరికైన ఒక చెంబుడు నీరైనా ఇవ్వనివారు నీటికై అలమటించు చాతకపక్షిగా పుట్టును. దప్పికతో బాధపడుచున్న వారికి చల్లనినీరు ఇచ్చినచో పదివేల రాజసూయ యాగముల ఫలం లభించును. ఎండవేడికి అలసి ఆర్తి పొందిన బ్రాహ్మణునికి విసనకర్రతో వీచినచో వారుచేసిన అన్నిపాపములు తొలగి గరుత్మతుండిగా జన్మించెదరు.

శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement