Wednesday, April 24, 2024

ఆర్ ఆర్ ఆర్…. బిజినెస్ మామూలుగా లేదుగా !!

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ ,కొమురం భీం ఎన్టీఆర్ నటించబోతున్నాడు. బాహుబలి తర్వాత రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఈ సినిమా శాటిలైట్ డిజిటల్ హక్కులను 325 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

అలాగే సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు ఇంత పెద్ద మొత్తంలో అమ్ముడుపోవడం ఇదే మొదటిసారి. మరోవైపు తమిళనాడు, కేరళ, కర్ణాటక హిందీ, ఓవర్సీస్ హక్కులు డిజిటల్ రైట్స్ బిజినెస్ మొత్తం తొమ్మిది వందల కోట్లకు చేరింది. కాగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 11న రిలీజ్ చేయాలని మొదట చిత్ర యూనిట్ భావించినా… ఆ సమయానికి రిలీజ్ సాధ్యమయ్యేలా కనిపించడంలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement