Wednesday, May 15, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 18, శ్లోకం 23
23.
నియతం సంగరహితమ్‌
అరాగద్వేషత: కృతమ్‌ |
అఫలప్రేప్సునా కర్మ
యత్తత్‌ సాత్త్వికముచ్యతే ||

తాత్పర్యము : నియమబద్ధమైనదియు, సంగరహితముగను రాగద్వేషరహితముగను ఒనరింపబడునదియు, ఫలాపేక్ష లేనటువంటిదియు అయిన కర్మము సత్త్వగుణము నందున్నట్టిదిగా చెప్పబడును.

భాష్యము : వేదశాస్త్రములలో ప్రతి వ్యక్తి యొక్క ప్రవృత్తి, ఆశ్రమమును బట్టి వారు చేయవలసిన విధులను వివరించుట జరిగినది. అటువంటి శాస్త్ర విధులను, ఫలాసక్తి లేదా యాజమానిత్వ భావన లేకుండా రాగద్వేషాలకు అతీతముగా నిస్వార్థముగా భగవంతుని ప్రీత్యర్థము కృష్ణ చైతన్యముతో చేసినపుడు, అటువంటి కార్యములు సత్వగుణ ప్రధానములగును.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement