Friday, April 26, 2024

కామ్యసిద్ధికి గో ఆరాధన

సర్వదేవతా ఆవాసం గోవు. గోవును తల్లిగా భావించి తల్లి చేసే మేలును మనకు కలిగిస్తుంది కనుక గోమాతగా తలుస్తాము. ప్రపంచంలో ఉన్న జీవులలో ఆక్సిజన్‌ పీల్చి ఆక్సిజన్‌ వదిలే ఏకైక జీవి గోవు. గోవు పాద ముద్రలు పడిన స్థలం అ్టషశ్వర్యాలకు నిలయం.
గోవు కొమ్ముల మొదటి భాగంలో బ్రహ్మ, విష్ణువులు, గోవు కొమ్మల చివర గంగాది తీర్థములు, నుదుటి భాగములో రుద్రుడు, నుదుటిపై భాగమున మహాదేవుడు, నాసికాగ్రమున షణ్ముఖుడు, కర్ణములయందు అశ్వనీ దేవతలు, కుడి కొమ్ములో భాస్కరుడు, ఎడమ కన్నులో చంద్రుడు, జిహ్వ భాగమున వరుణదేవుడు, హుంకారమున సరస్వతీదేవి, దవడలలో యమధర్మరాజు, పెదవులలో ఉభయసంధ్యలు, మెడనందు ఇంద్రుడు, ఉదరమున త్రయోదశ విశ్వేదేవతలు, వక్షస్థలమున గాయత్రీదేవి, నాలుగు పాదాలలో నాలుగు వేదములు, డెక్కల మధ్య గంధర్వులు, డెక్కల చివర గరుత్మంతుడు, డెక్కల ఉభయ పార్వ్శములో అప్సరసలు, పృష్ఠ భాగమున లక్ష్మీనారాయణులు, ఏకాదశ రుద్రులు, అవయవ సంధులలో అష్టవసువులు, పిరుదులలో పితృదేవతలు, తోకనందు సోముడు, తోకయందలి రోమముల్లో సూర్యచంద్రులు, మూత్రమున గంగాదేవి, గాయత్రీ దేవి, పొదుగునుండి వచ్చు పాలలో సరస్వతీదేవి, పెరుగులో నర్మదా తీర్థం, నెయ్యినందు లక్ష్మీదేవి, రోమములలో త్రయత్రిం శత్కోటి దేవతలు, ఉదరమున భూమాత మొదలగు సమస ్తదేవతలు నివసిస్తారు.
వేదములలో, పురాణాలలో గోవు మాహాత్మ్యమును ఈ విధంగా చెప్పడం జరిగింది.
గోసూక్తం
అధర్వణవేదం నాలుగవ కాండములో 12వ సూక్తంలో గోవుయొక్క మహాత్మ్యాన్ని వివరంగా చెప్పడం జరిగింది. గోవు రుద్రులకు తల్లి, వసువులకు పుత్రిక, ఆదిత్యునకు సోదరి, ఘృత రూపమున అమృత భాండాగారము అని చెప్పడం విశేషం. ఋగ్వేదంలో ”అఘన్యా” అని గోవును పేర్కొనటం జరిగింది.
”గోభిస్తుల్యం నపశ్యామి ధనంకించిదిహాచ్యుత” అని మహాభారతములో గోవుతో సమానమైన సంపద లేదని తెలుపబడింది. గోవుకు సంబంధించిన కీర్తనం, శ్రవణం, దానం, దర్శనం అన్నీ పుణ్యప్రద కార్యక్రమములే.
గోవు భౌతిక, ఆధ్యాత్మిక ఉన్నతిని, సంపదలు ఇస్తుందని, సర్వతీర్థ ఫలదాయకమని, ఆవు సేవ అత్యత్తమ మోక్ష మార్గమని పద్మపురాణములో తెలియచేయబడినది.
గోమాత ”సురభీదేవి” అంసగా దేవీభాగవతములో చెప్పబడింది. పరాశక్తి సురభీదేవిగా గోస్వరూపముగా ఆవిర్భవించిందని చెప్తారు.
సమస్త గోవులు విష్ణుస్వరూమని వ్యాసుడు బ్రహ్మ పురాణంలో పేర్కొన్నాడు. గోవు త్రిమూర్తులకు అత్యంత ప్రీతికరమైనదని బ్రహ్మదేవుడు దేవతలకు, ఋషులకు చెప్పాడు. బ్రాహ్మణులు, గోవులు ఒక్కటిగానే పరిగణింపబడినవి. బ్రాహ్మ ణులకు, గోవుకి అత్యంత పవిత్రత కలదని, కాలక్రమములో అవి రెండుగా మారాయని, విప్రులలో మంత్రాలు, గోవులలో యజ్ఞానికి ఉపయోగపడే హవిస్సుల ఉంటాయని కాశీఖండము రెండవ అధ్యాయంలో చెప్పడం జరిగింది.
యజుర్వేదంలో గోవుకు ఎవరూ సాటిరారని పేర్కొనబడింది. పురుష సూక్తం, శ్రీసూక్తం, మన్యుసూక్తం వంటి పవిత్ర సూక్తాలలో గోసూక్తం చెప్పడంలో గోవు యొక్క విశేష మహాత్మ్యం తెలుస్తోంది. గ్రహదోష పరిహారాలకు గోవు చక్కని పరిష్కారాన్ని అందిస్తుంది. మనకున్న గ్రహ దోషాలను అనుసరించి, గోవుకు పరిహారంగా, ఆ గ్రహసంభంధమైన ఆహారాన్ని తినిపిస్తే దోష పరిహారం జరిగి ప్రశాంతత చేకూరుతుంది. అయితే చూలి ఆవుకు కొన్ని రకాల ఆహార పదార్థాలు పెట్టకూడదు. ఈ విషయాన్ని తెలుసుకుని తగిన విధమైన ఆహారాన్ని అందించాలి. పప్పు ధాన్యాలను సుమారు 5,6 గంటలు నీటిలో నానబెట్టి పరివర్తనం చెందిన వాటిని మాత్రమే దోషపరిహారానికి వాడాలి. కాయగూరలను శుభ్రంగా కడిగి నోటికి అందివ్వాలి. మానవులకు నిత్యజీవితంలో అనేక సమస్యలు, ఒడిదుడుకులు ఉంటాయి. వాటిని గోసేవతో సూక్ష్మంగా నివారించుకోవచ్చునని చెబుతారు.
వృత్తియందు నిలకడ కోసం ఉలవలను, ధనవృద్ధికి బొబ్బర్లు, కీర్తి ప్రతిష్టలకు గోధుమలు, ప్రశాంతత కావాలనుకునే వారు బియ్యం పిండి, బెల్లం, క్రోధం అదుపు చేసుకునేందుకు కందులు, ఆధ్యాత్మిక ప్రశాంతతకై శనగలు, దారిద్య్రం పోగొట్టుకు నేందుకు బెల్లము, రాగిపిండి, విద్యాభివృద్ధి కోసం పెసలు, నరఘోషనివారణకు బంగాళదుంపలు, వ్యాపారాభివృద్ధి కోసం క్యారెట్లు, ఐశ్వర్య వృద్ధికి బీట్రూట్‌, పాలకూర, శత్రునివారణకు దోసకాయలు, వివాహ ప్రాప్తి కోసం టమాటా, సంతానము నిమి త్తం వంకాయ, దొండకాయ, ఉన్నత పదవుల కోసం అరటి కాయలు, మహాధైర్యం పొందడానికి బెండకాయలు, ఋణవి ముక్తి కలిగేందుకు కందిపప్పు, ఆరోగ్యప్రాప్తికి మినపప్పు తినిపిం చాలని పండితులు చెబుతారు. గోవుకు ఆహారం ఇచ్చేవారు స్వచ్ఛమైన మనస్సుతో తమతమ గోత్రనామములను మనస్సులో సంకల్పము చేసుకొని ఇవ్వాలి.

డాక్టర్‌. దేవులపల్లి పద్మజ
98496 92414

Advertisement

తాజా వార్తలు

Advertisement