Friday, June 9, 2023

ఉత్సవ విగ్రహాలకు చక్రస్నానం..

బెల్లంపల్లి : కోదండ రామాలయం సీతారాముల కళ్యాణ మహోత్సవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా హోమ పుర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు చక్రతీర్థం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయం ఉత్సవ విగ్రహాలను పంచ ద్రవ్యాలతో, పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం నూతన వస్త్రాలతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్‌ రేణికుంట్ల శ్రీనివాస్‌, ధర్మకర్తలు మమత, ఆచి పద్మ, పూజారులు, వెంకటాచార్యులు, శ్రీనివాసచార్యులు, మురళీధర్‌ ఆచార్యులు, వంశీధర్‌ అచార్యులు, రామకృష్ణ ఆచార్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement