Friday, April 26, 2024

ఆది వైద్యులు అశ్వినీదేవతలు

అశ్వినీ దేవతలు పురాణ పురుషులు. కవలలు అయిన వీరిద్ద రినే తథాస్తు దేవతలు అంటారు. సత్కర్మలు జరిగే పవిత్ర ప్రదేశాలే వారి నివాస స్థానమని పురాణాలు చెబుతున్నాయి. ఏం మాట్లా డినా ”తథాస్తు దేవతలుంటారు జాగ్రత్త” అని మన పెద్దలు అం టుంటారు. ముఖ్యంగా సంధ్యా సమయంలో ఈ దేవతలు సంచరి స్తారని, ఆ సమయంలో చెడు మాటలు మాట్లాడితే వీరు తథాస్తు అంటారని, అంటే చెడు జరుగుతుందని పెద్దలు హెచ్చరిస్తుంటారు.
తథాస్తు దేవతలు అయిన ఈ అశ్వినీ దేవతలు సూర్యపుత్రు లు. వీరు అశ్వ రూపంలో ఉండగా సూర్యుడు, ఛాయాదేవి సంభో గించడం వలన జన్మించారు. అందుకే వీరు అశ్వ ముఖంతో వుంటా రు. వీరి సోదరి ఉష. ఆమె ప్రతి రోజు వీరిని బ్రహ్మ ముహూ ర్తంలో మేల్కొలుపుతుందట.
ఆ తరువాత వారు రథాన్ని అధిరోహించి తమ సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకుని తూర్పుదిక్కు నుండి పడమటి దిక్కుకు ప్రయాణిస్తారు. వీరు ప్రయాణించే రథం పేరు హరణ్యవర్తం. అది హిరణ్య యానమనే దోవలో వాయువేగ మనోవేగాలతో ప్రయా ణిస్తుంది.
ఆ రథం చాలా బృహత్తరమైనది. అది హిరణ్యంతో నిర్మిం చ బడింది.ఆ రథానికి మూడు గుర్రాలు నడుపుతుంటాయి. అద్వ రాశ్యాలనే ఆ గుర్రాలు తెల్లగా నున్నగా ఎల్లప్పుడూ యవ్వనంతో అత్యంత ఉత్సాహంతో ఉంటాయి.
చిత్రమైన ఈ రథానికి చక్కాలూ మూడే ఉంటాయి. సారథి కూర్చోవడానికి త్రిఫలకాలు,త్రిబంధురాలు అనే పేర్లు కలిగిన మూడు ఆసనాలు ఉంటాయి.
ఆ రథంలో ఒకవైపు ధనం, మరొకవైపు తేనె, సోమరసం మరొకవైపు ఆయుధాలు ఉంటాయి. రథం పైభాగంలో వేయి పతాకాలు రెపరెపలాడుతూ ఎంతో సుందరంగా ఉంటాయి.
అశ్వినీ దేవతల కంఠధ్వని శంఖనాదంలా మధురంగా ఉం టుంది. ఈ దేవతలను అంతా వేదమంత్రాలతో ఆహ్వానిస్తుంటారు. వీరు ఉపాసకుల మంత్రాలలోని సత్యాన్ని మాత్రమే గ్రహించి వారి ని అనుగ్రహిస్తుంటారు.
వీరి చేతితో తేనె, సోమరసం, మంచుతో అద్దిన బెత్తం వుం టాయి. వీరు యజ్ఞం చేసే ప్రదేశానికి విచ్చేసి అధిపతులను, యజ్ఞ ద్రవ్యాలను బెత్తంతో సుతిమెత్తగా తాకి వారిని అనుగ్రహి స్తుంటా రు. వేదాలలో అశ్వినీ దేవతల వర్ణన ఉంది. వేదాలలో వీరి గురించి దాదాపు నూరు సూక్తాల వరకు ఉంది. వీరిని ఆది వైద్యులుగా పురా ణాలు వర్ణించాయి.
అశ్వినీ దేవతలు దయార్ద్ర హృదయులు, ధర్మపరులు, సత్య సంధులు. వీరి ఆయుధాలలో అత్యంత ప్రభావితమైన మహా ఔష ధాలు ఉంటాయి. వీరు అనేక సందర్భాలలో ఆరోగ్య సమస్యలతో బాధపడేవారి ఆహ్వానం పై వచ్చి వారికి శస్త్ర చికిత్సలు సైతం చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి.
వైద్యశాస్త్రానికి అధిపతులైన ఈ దేవతలు కుడిచేతిలో అభయ ముద్ర, ఎడమ చేతిలో ఆయుర్వేద గ్రంథం, కుడి పక్కన మృత సంజీవిని, విశల్యకరణిలాంటి ఔషధీ లతలు ఎడమవైపు అమృత కలశాన్ని పట్టుకున్న ధన్వంతరి కలిగి ఉంటారని పురాణాలు వీరి రూపాన్ని వర్ణించాయి. ఈ దేవతలు విరాట్‌ పురుషుని నాశికా భాగంలో ఉంటారు.
– పుల్లాభొట్ల భాస్కర శర్మ

Advertisement

తాజా వార్తలు

Advertisement