Wednesday, May 8, 2024

అభ్యంగన స్నానం ఎలా చేస్తే మంచిది

మానవుడికి స్నానం అనునది ఒక భోగం. ఒక యోగం. స్నానాన్ని ఏదో ఒళ్లు తడిపాము అన్నట్లు-కాక తనువు మనసు తడిచేలా అనుభూతి చెందుతూ స్నానం ఆచరించాలి.
చన్నీటి స్నానం శిరస్సు నుంచి ప్రారంభించాలి. వేడినీటి స్నానం పాదాల నుంచి ప్రారంభించి తరువాత శరీరం తడపాలి. పురు షులు విధిగా రోజూ శిరస్నానం ఆచరించాలి. పర్వదినాల లోనూ, జన్మదినముననూ, విశేష క్రతువుల ప్రారంభంలోనూ అభ్యంగన స్నానాన్ని తప్పకుండా ఆచరిం చాలి. తైలాభ్యంగనం అంటే నువ్వుల నూనెతో తలంటి పోసుకో వడం ప్రధమ విధి. శరీరానికి తైలా న్ని (నువ్వుల నూనెను) బాగా రాసి మర్దన చేసి నలుగు పిండితో ఒళ్ళు రుద్దుకుని గోరువెచ్చటి నీటితో
స్నానం చేయడాన్ని అభ్యంగ (తలంటి) స్నానం అంటారు. నరక చతుర్దశి, ఉగాది వంటి శుభదినా
లలో సూర్యోదయానికి పూర్వమే మహాలక్ష్మి నువ్వుల నూనెలోను, గంగాదేవి నీటిలోను ఆవ హించి వుంటుందని ఆర్యోక్తి. కావున శరీరానికి, తలకు నువ్వుల నూనె రాసుకుని, నలుగు పెట్టు కుని, ఆపై కుంకుడుకాయలతో తలంటుకుని అభ్యంగన స్నానం చేసినట్లయితే లక్ష్మి, గంగాదేవుల అను గ్రహాన్ని పొందగలుగు తారు.
”అభ్యంగంకారయోన్నిత్యం సర్వేష్వంగేషు పుష్ఠినం”
(అభ్యంగన స్నానం అన్ని అవయవాలూ పుష్టిదాయకం) అని ఆయుర్వేదోక్తి దృష్ట్యా అభ్యంగనం ఆరోగ్యం కూడా. ఆరోగ్య రీత్యా ఆధ్యాత్మిక రీత్యా తైలాభ్యంగనానికి ఈ రీతిగా విశేష ప్రాధా న్యమీయబడింది. అయితే అభ్యంగన స్నానం నిత్యం చేయకూ డదు. శ్రాద్ధ దినములయందు, ఆది, మంగళ వారము లు, అమా వాస్య, పాడ్యమి, చవితి, షష్ఠి, అష్టమి, నవమి, చతుర్దశి తిధుల యందు అభ్యంగన స్నానం చేయకూడదు. అనివార్యమై చేయ వలసి వచ్చినప్పుడు ఈ కింద సూచించిన విధము చేయడం వలన దోషము తొలగి శుభం కలుగుతుంది.

అభ్యంగన స్నాన వార దోషములు
ఆదివారం – తాపము. నివారణకు నూనెలో
పుష్పములు వేసుకోవాలి.
సోమవారం – కాంతి, మనోల్లాసము.
మంగళవారం – మృతి. నివారణకు నూనెలో మన్ను వేసుకోవాలి.
బుధవారం – లక్ష్మీ కటాక్షము.
గురువారం – ధననాశం. నివారణకు నూనెలో గరిక వేసుకోవాలి.
శుక్రవారం – విపత్తు. నివారణకు నూనెలో గోమయం వేయాలి.
శనివారం – భోగము. అయితే పండుగ, శుభదినములకు ఈ దోషము వర్తించదు.

అభ్యంగన స్నానం చేయడానికి స్త్రీలకు
గురు, శుక్రవారములు శుభ దినములు.

– డా. చదలవాడ హరిబాబు
9849500354

Advertisement

తాజా వార్తలు

Advertisement