Friday, May 3, 2024

అన్నమయ్య సంకీర్తనలు

రాగం : మోహన రాగం
క్షీరాబ్ధి కన్యకకు శ్రీమహాలక్ష్మికిని
నీరజాలయమునకు నీరాజనం || క్షీరాబ్ధి ||

జలజాక్షి మోమునకు జక్కువ కుచంబులకు
నెలకొన్న కప్పురపు నీరాజనం
అలివేణి తురుమునకు హస్తకమలంబునకు
నిలువు మాణిక్యముల నీరాజనం || క్షీరాబ్ధి ||

చరణ కిసలయములకు సకియ రంభోరులకు
నిరతమగు ముత్తేల నీరాజనం
అరిది జఘనంబునకు అతివ నిజ నాభికిని
నిరతి నానావర్ణ నీరాజనం || క్షీరాబ్ధి ||

పగటు శ్రీవేంకటేశు పట్టపురాణియై
నెగడు సతికళలకును నీరాజనం
జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల
నిగుడు నిజ శోభనపు నీరాజనం || క్షీరాబ్ధి ||

Advertisement

తాజా వార్తలు

Advertisement