Thursday, April 18, 2024

డబ్బింగ్ స్టార్ట్ చేసిన గని

కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం గని. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాక్సర్ గా వరుణ్ తేజ్ కనిపించబోతున్నారు. కాగా ఈ సినిమా దీపావళి కానుకగా రిలీజ్ కాబోతోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ స్టార్ట్ చేశాడు వరుణ్.

ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ దిస్ దివాలీ 2021 అంటూ ఫిల్మ్ మేకర్స్ అఫీషియల్ గా ఇదే విషయాన్ని అనౌన్స్ చేశారు. ఈ సినిమాను సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుండగా… బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా… అల్లు బాబీ నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement