Tuesday, May 7, 2024

రాఘవేంద్రరావు నటుడిగా మారిన వేళ!!

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. వందకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన రాఘవేంద్రరావు ఓం నమో వెంకటేశాయ సినిమా తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే ఇప్పుడు నటుడిగా అవతారం ఎత్తుతున్నారు రాఘవేంద్రరావు. పెళ్లి సందడి సినిమాకు సీక్వెల్ పెళ్లి సందD లో నటించబోతున్నారు రాఘవేంద్రరావు. అలాగే తనికెళ్ల భరణి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ బాబు సినిమాలో కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

అంతే కాకుండా ఇప్పుడు ఒక స్టార్ హీరో చిత్రంలో అతిథి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక రాఘవేంద్రరావు ప్రస్తుతం గౌరీ రోనంకి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెళ్లి సందD సినిమాకు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. ఇందులో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటిస్తుండగా… శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను రాఘవేంద్రరావు సోదరుడు కే కృష్ణ మోహన్ రావు నిర్మిస్తుండగా… కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement