Wednesday, May 15, 2024

అన్నమయ్య సంకీర్తనలు

నిగమ నిగమాంత

నిగమ నిగమాంతవర్ణిత మనోహరరూప
నగరాజ ధరుడ శ్రీ నారాయణా || ||నిగమ నిగమాంత||

దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యంబియ్య
నోపక కదా నన్ను నొడబరపుచు
పైపైనే సంసార బంధముల కట్టేవు
నా పలుకు చెల్లునా నారాయణా || ||నిగమ నిగమాంత||

చీకాకుపడిన నా చిత్త శాంతముసేయ
లేకకా నీవు బహు లీలనన్ను
కాకుసేసెదవు బహు కర్మముల బడువారు
నాకొలది వారలా నారాయణా || ||నిగమ నిగమాంత||

వివిధ నిర్భంధముల వెడల ద్రోయకనన్ను
భవసారముల దడ బడ జేతురా
దివిజేంద్రవంద్య శ్రీ తిరువేంక టాద్రీశ
నవనీతిచోర శ్రీ నారాయణా || ||నిగమ నిగమాంత||

Advertisement

తాజా వార్తలు

Advertisement