Monday, April 29, 2024

ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో ‘జబర్దస్త్’ కమెడియన్!

బుల్లి తెరపై జబర్దస్త్ కార్యక్రమానికి ఎలాంటి క్రేజ్ ఎందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షోతో ఎంతో మంది కామెడియన్స్ వెలుగులోకి వచ్చారు. అయితే, ఈ షో పాల్గొనే నటులు పలు కేసుల్లో ఇరుక్కోవడం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఓ జబర్దస్త్ నటడు వ్యభిచారం కేసులో కూడా బుక్కయ్యాడు. తాజాగా జబర్దస్త్ మరో నటుడు హరి ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో చిక్కకున్నాడు. ఇప్పటికే ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు. అయితే తాజాగా ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో మరోసారి జబర్దస్త్ హరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. హరికి ఎర్రచందనం స్మగర్లతో సంబంధాలు పెట్టుకున్నట్టు పోలీసులు గుర్తించారు.

 చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో అటవీశాఖ అధికారులు కూంబింగ్ చేస్తున్న సమయంలో 8 మంది ఎర్రచందనం స్మగ్లర్లు పట్టుబడ్డారు. వారి నుంచి రెండు నాటు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు రూ. 3 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ స్మగ్లింగ్ గ్యాంగుతో హరికి సంబంధాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే అతడి కోసం పోలీసులు స్పెషల్ టీం గాలింపు చేపట్టినట్లుగా తెలుస్తోంది.

చిత్తూరు జిల్లా పోలీసులు గతంలోనే హరిపై స్మగ్లింగ్ కేసులతో పాటు, పలు కేసులు నమోదు చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాడనే ఆరోపణలు ఉన్నాయి. అయితే గతంలో ఈ విషయంపై స్పందించిన హరి.. మరోవైపు, ఈ అంశంపై హరి స్పందించాడు. ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేస్తుంటే.. తాను పోలీసులకు సమాచారం అందించానని… ఆ కోపంతో అతను తనపై తప్పుడు కేసులు పెట్టాడని హరి ఆరోపించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement