Tuesday, May 14, 2024

అన్నమయ్య కీర్తనలు : వలపులు వలపులు

వలపులు వలపులు వయాళి
చలమరి మరుడును సమేళి || వలపులు వలపులు ||

నెలతమోమునకు నీ కనుచూపులు
నిలుపున ముత్తెపు నివాళి
కొలదికి మీరిన గురు కుచ ములకును
తొలకు నీ మనసు దువాళి || వలపులు వలపులు ||

వనిత నిండు జవ్వన గర్వమునకు
ఘనమగు నీరతి కరాళి
వెనక ముందరల వెలది మేనికిని
పెనకు గోంకొన పిసాళి || వలపులు వలపులు ||

పడతి కోరికల భావంబునకును
కడు కడు నీ తమి గయాళి
చిడిముడి మగువకు శ్రీ వేంకటపతి
విడువని కూటపు విరాళి || వలపులు వలపులు ||

Advertisement

తాజా వార్తలు

Advertisement