Monday, December 11, 2023

త‌న‌ వివాహ వేడుక‌ని.. వీడియో సాంగ్ గా రిలీజ్ చేసిన మ‌నోజ్

త‌మ పెళ్ళి ఘ‌ట్టాల వీడియో సాంగ్ రూపంలో రిలీజ్ చేశారు హీరో మంచు మ‌నోజ్..ఇటీవల మంచు మనోజ్ – భూమా మౌనిక వివాహం జరిగింది. గతంలో ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న సాన్నిహిత్యమే వీరి ప్రేమకి పునాది వేసిందని అంటారు. తండ్రి మోహన్ బాబును ఒప్పించి భూమా మౌనికను పెళ్లి చేసుకున్నాడు మ‌నోజ్. కుటుంబ సభ్యులతో పాటు వీరి వివాహానికి కొంతమంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఘట్టాలను వీడియో సాంగ్ రూపంలో రిలీజ్ చేశారు. ఏం మనసో .. ఏం మనసో’ అంటూ అనంత శ్రీరామ్ రాసిన పాటకి అచ్చు రాజమణి ట్యూన్ చేయడమే కాకుండా, ఆయనే ఈ పాటను ఆలపించారు. పెళ్లికి సంబంధించిన దృశ్యాలను ఈ పాటపై కట్ చేశారు. ఆత్మీయుల రాక .. ఇద్దరినీ ముస్తాబు చేయడం .. ఉంగరాలు మార్చుకోవడం .. తలంబ్రాలు పోసుకోవడం .. అరుంధతి నక్షత్రం చూపించడం .. పెద్దల ఆశీస్సులు మొదలైన దృశ్యాలపై ఈ పాట సాగింది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement