Friday, April 26, 2024

వకీల్ సాబ్ కి భయపడ్డ శ్రీ రెడ్డి

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం వకీల్ సాబ్. బాలీవుడ్ లో అమితాబ్ నటించిన పింక్ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9న వరల్డ్ వైడ్ గా ఈ సినిమా థియేటర్లో రిలీజ్ కాబోతోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది.

పవన్ కళ్యాణ్ పేరు చెప్తే చిర్రుబుర్రులాడుతూ ఉండే శ్రీ రెడ్డి ఇప్పుడు ట్రైలర్ పై ఒక్క మాట కూడా నోరు మెదపలేదు. గతంలో పవన్ కళ్యాణ్ పై అనేక ఆరోపణలను శ్రీరెడ్డి చేసిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా కూడా వకీల్ సాబ్ పోస్టర్ పై పిట్టల సాబ్ అంటూ కామెంట్ చేసింది. కానీ ట్రైలర్ పై మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దీనిపై నెటిజన్స్ శ్రీరెడ్డి కి ఏమైంది అనుకుంటూ మాట్లాడుకుంటున్నారు. నిజానికి పవన్ ఫ్యాన్స్ కు భయపడి శ్రీరెడ్డి స్పందించ లేదనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. మరి నిజంగానే పవన్ ఫ్యాన్స్ కు శ్రీరెడ్డి బయపడిందంటారా !!

Advertisement

తాజా వార్తలు

Advertisement