Sunday, April 28, 2024

ఈ వీకెండ్ ఎవ‌రిది? రేపు థియేట‌ర్ వద్ద క్లాష్ కానున్న రెండు సినిమాలు..

ఈ నెల (ఏప్రిల్)లో చాలా సినిమాలు థియేట‌ర్ల‌లో రిలీజ్ అయ్యేందుకు సిద్దంగా ఉన్నాయి. అయితే వాటిలో కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నాయి. ఈ వారాంతంలో రెండు సినిమాల మ‌ద్య ఫైట్ ఉండ‌నుంది. అవే రవితేజ నటించిన ‘రావణాసుర’, మరొకటి కిర‌ణ్ అబ్బ‌వ‌రం ‘మీటర్’ . ఈ రెండు సినిమాలు రేపు (ఏప్రిల్ 7న) ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్నాయి.

‘రావణాసుర’

రవితేజ ‘రావణాసుర’ పెద్ద బ‌డ్జెట్ తో తెర‌కెక్కింది. అంతే కాకుండా, ర‌వితేజ సినిమా అంటేనే ఎక్కువ మంది ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. రవితేజ “ధమాకా”, “వాల్తేర్ వీరయ్య”సినిమాల‌తో ఇండస్ట్రీకి రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చి ఫామ్ లోకి వచ్చాడు. కాగా, థ్రిల్లర్‌గా తెరకెక్కిన‌ ‘రావణాసుర’లో రవితేజ లాయర్‌గా క‌నిపించ‌నున్నాడు. ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్స్: అను ఇమ్మాన్యుయేల్, పూజిత పొన్నాడ, మేఘా ఆకాష్, దక్షా నగర్కర్, ఫరియా అబ్దుల్లా ఉండ‌టం ప్రధాన ఆకర్షణ అనే చెప్ప‌వ‌చ్చు.

‘మీటర్’

మరోవైపు ‘మీటర్’ సినిమాతో అప్ కమింగ్ హీరో కిరణ్ వ‌స్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించింది. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం ఆల్ అవుట్ మసాలా క‌నిపించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఈ రమేష్ కడూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కిరణ్ అబ్బవరంకి జోడీగా అతుల్య రవి న‌టించింది. పోసాని కృష్ణ మురళి, సప్తగిరి ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఇక రేపు(ఏప్రిల్7న‌) థియేట‌ర్ల‌లో ఏ సినిమా ఎలా ఆక‌ట్టుకుంటుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement