Wednesday, May 8, 2024

బిజెపికి సుదీప్ మ‌ద్ద‌తు.. దిగ్భ్రాంతికి గుర‌య్యా.. ప్ర‌కాశ్ రాజ్

రాజ‌కీయాల‌పై త‌న‌దైన‌శైలిలో స్పందిస్తున్నారు సీనియ‌ర్ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్. కాగా కన్నడ స్టార్ కిచ్చ సుదీప్‌ బీజేపీకి మద్దతు ప్రకటించడంపై ప్రకాశ్ రాజ్ తీవ్రంగా స్పందించారు. సుదీప్ ప్రకటనతో తాను దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపారు. ఎంతో బాధపడ్డానని.. తీవ్ర నిరాశలో కూరుకుపోయానని అన్నారు. నిరాశలో కూరుకుపోయిన బీజేపీ ఈ నకిలీవార్తను వ్యాప్తి చేసిందని బలంగా నమ్ముతున్నానన్నారు. సుదీప్ ఒకరి ఎరలో పడేంత తెలివితక్కువ వ్యక్తి కాదని ట్విటర్‌లో స్పందించారు.సీఎం బసవరాజ్‌ బొమ్మైతో కలిసి సుదీప్‌ బుధవారం రోజున మీడియా సమావేశంలో పాల్గొని.. సీఎంకు తన మద్దతు ప్రకటించేందుకు వచ్చానని తెలిపారు. ఆయన తనకు గాడ్‌ఫాదర్‌ లాంటి వారని అన్నారు. బొమ్మైను తాను ప్రేమతో మామా అని పిలుచుకుంటానని.. క్లిష్ట సమయంలో ఆయన తనకు అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. బొమ్మైకి మద్దతు ఇస్తున్నానంటే దానర్థం ఆయన సూచించిన వారందరికీ అన్నారు. సుదీప్ క్లారిటీ ఇవ్వడంతో ప్రకాశ్ రాజ్ పై విధంగా స్పందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement