Monday, April 29, 2024

పెళ్లి పీట‌లు ఎక్క‌నున్న బాలీవుడ్ భామ‌ కంగ‌నా

పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో అడుగుపెట్టాల‌ని హీరోయిన్లు ఎంత‌గానో ఆరాట‌ప‌డుతున్నారు. రిసెంట్‌గా ర‌కుల్ ప్రీత్ సింగ్ త‌న ప్రేమాయ‌ణం బ‌య‌ట‌పెట్టి త‌న ప్రియుడుని ప‌రిచ‌యం చేసింది. ఇక ఇప్పుడు బాలీవుడ్ హాట్ బోల్డ్ యాక్ట‌ర్ కంగ‌నాఈ ర‌నౌత్ టైవ వ‌చ్చింది. ఓ ఇంట‌ర్వ్యూలో రాబోయే ఐదేళ్ల‌లో ఎలా క‌నిపించ‌బోతున్నారు అని ప్ర‌శ్న‌లు సంధించగా,దానికి ఆస‌క్తిక‌ర స‌మాధానాలు ఇచ్చింది కంగ‌నా.

రాబోయే ఐదేళ్ల‌లో త‌ల్లిగా న‌న్ను నేను చూడాల‌ని అనుకుంటున్నాను. త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకొని పిల్ల‌ల్ని కనాల‌ని ఉంది. అని కంగ‌న బ‌దులిచ్చింది. మీ జీవితంలో ఎవరైనా ప్ర‌త్యేక‌మైన వ్య‌క్తి ఉన్నారా? అంటే అవున‌ని ఆమె తెలిపారు. అంతే కాదు.. ఆ వ్య‌క్తి గురించి త్వ‌ర‌లోనే అంద‌రికీ తెలుస్తుంద‌ని కంగ‌నా చెప్ప‌డం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement