Saturday, May 4, 2024

Breaking : ‘విగ్గు’తో అమ్మాయిల‌కి వ‌ల‌.. ఆ తర్వాత అసలు కథ!

హైద‌రాబాద్ లో ఓ దేశ ముదురు బాగోతం బ‌ట్ట‌బ‌య‌లు అయింది. విగ్గుతో అమ్మాయిల‌ను మోసం చేస్తున్నాడు మ‌హ్మ‌ద్ ర‌ఫీ అనే కేటుగాడు పోలీసులకు చిక్కాడు. తాను ఎన్నారైనంటూ సోష‌ల్ మీడియాలో బిల్డ‌ప్ ఇచ్చి.. 20 మంది అమ్మాయిల‌కు వల వేశాడు. ఈ మాయల్లోడి వల పడిన యువతులను అవసరం తీరిన తర్వాత మోసం చేయడం మ‌హ్మ‌ద్ ర‌ఫీకి అలవాటు. అమ్మాయిల‌తో ప‌రిచ‌యం పెంచుకుని కొన్నాళ్ల‌పాటు స‌హ‌జీవ‌నం చేయండం ..ఆ త‌ర్వాత వారిని వ‌దిలించుకోవ‌డం ర‌ఫీకి ప‌రిపాటిగా మారింది. ఆ త‌ర్వాత వారి వ్య‌క్తిగ‌త ఫొటోలు పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తుండేవాడు. ఓ బాధితురాలి ఫిర్యాదుతో వీడి బాగోతం బయట పడింది. దీంతో ఈ కేటుగాడిని పోలీసులు అరెస్టు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement