Wednesday, April 24, 2024

‘ఖిలాడి’ వచ్చేది ఎప్పుడంటే..

మాస్ మహారాజా రవితేజ్ ‘ఖిలాడి’గా రాబోతున్నాడు.   మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ తుది దశకు చేరుకుంది. రమేశ్ వర్మ దర్శకత్వంలో సత్యనారాయణ కోనేరు దీన్ని నిర్మించారు.  ఈ సినిమా విడుదల తేదీని మూవీ టీం అధికారికంగా ప్రకటించింది. ఫిబ్రవరి 11న ఖిలాడి థియేటర్లలో సందడి చేయనున్నాడు. ఈ సినిమా కూడా ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని ప్లాన్ చేశారు.  కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ లో జాప్యం జరగడంతో రిలీజ్ పోస్ట్ పోస్ అయ్యింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్టు సింగిల్ కి రికార్డు స్థాయి వ్యూస్ లభించాయి. ఈ ఏడాది జనవరిలో క్రాక్ తో హిట్ కొట్టిన రవితేజ.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనూ ఖిలాడిగా మరో హిట్ కొడట్టం ఖాయంగా కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement