Sunday, December 8, 2024

కేజీఎఫ్3 కోసం వెయిటింగ్.. ర‌వీనాటాండ‌న్

కేజీఎఫ్ 3కోసం తాను వెయిట్ చేస్తున్న‌ట్లు చెప్పారు బాలీవుడ్ న‌టి రవీనా టాండన్.. కే.జి.ఎఫ్ 3 సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అని అన్నా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కేజీఎఫ్ టీమ్ తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. కె.జి.ఎఫ్ 3 ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్నా.. మళ్లీ ఆ యూనిట్ తో కలిసి పనిచేయాలని అనుకుంటున్నానని అన్నారు. ద‌ర్శ‌కుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్. కేజీఎఫ్2 కూడా విడుదలైన అన్ని ఏరియాల్లో హిట్ టాక్ సొంతం చేసుకుంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా రెండు పార్ట్ లు రిలీజ్ అయ్యాయి. కేజీఎఫ్ సినిమా దాదాపు వేయి కోట్లు వరకు వసూల్ చేసింది. కేజీఎఫ్ 2 సినిమా కూడా వేయి కోట్లకు పైగా వసూల్ చేసింది. గత ఏడాది రిలీజ్ అయిన కేజీఎఫ్ 2 లో మొదటి పార్ట్ కంటే కొత్త నటీనటులు ఎక్కువ మంది నటించారు. వీరిలో బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్త, రవీనా టాండన్ ముఖ్యపాత్రలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement