Tuesday, May 7, 2024

Vishal | రాజకీయాల్లోకి విశాల్ ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన హీరో

తమిళ హీరోలు సినీ రంగంలోనే కాక రాజకీయ రంగంలోనూ తమ సత్తా చాటాలనుకుంటున్నారు. ఇప్పటికే ప్రముఖ స్టార్ హీరోలంతా కొత్త పార్టీలు పెట్టి, పార్టీ పేరును ప్రకటిస్తున్నారు. ఇటీవలే దళపతి విజయ్ ‘తమిళ వెట్రి కళగం’ పేరుతో ఓ పార్టీ రాజకీయాల్లోకి వచ్చాడు. విజయ్‌ బాటలోనే తాజాగా మరో హీరో విశాల్.. తమిళనాడు రాజకీయాల్లోకి వస్తున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయన కూడా పార్టీ పెడతారని వార్తలు వచ్చాయి.

ఇక ఈ వార్తలపై విశాల్ క్లారిటీ ఇచ్చారు. రాజకీయాల్లో వచ్చి సంపాదించాలని అనుకోవడం లేదని విశాల్ తెలిపారు. ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే సేవ చేయడానికి మాత్రమే వస్తానని తెలిపారు. ఇప్పుడు రాజకీయాలపై ఫోకస్ చేయడం లేదని.. భవిష్యత్లో కీలక నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు.

విశాల్‌ ప్రస్తుతం ‘విశాల్‌ పీపుల్స్‌ హెల్త్‌ మూమెంట్‌’ పేరుతో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక తన తల్లి పేరు మీద దేవి ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తామని తెలిపారు. అదేవిధంగా విద్యార్థుల చదువకు తన వంతు సాయం చేస్తానని చెప్పారు. ఇప్పటికే ఎంతో మంది విద్యార్థులు, రైతులకు సాయం అందించినట్లు వివరించారు. రాజకీయ లబ్దిని ఆశించి ప్రజలకు సాయం చేయలేదని స్పష్టం చేశారు. ఒక వేళ తాను రాజకీయాల్లోకి రావాలని ప్రజలు కోరుకుంటే తగిన నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement