Tuesday, April 30, 2024

Vishwak Sen | గామి రిలీజ్ డేట్‌, మేకింగ్ వీడియో రిలీజ్ !

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లైనప్‌లో రిలీజ్ కోసం వేయిట్ చేస్తున్న సినిమాల్లో ‘గామి’ ఒకటి. విద్యాధర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడింది. నాలుగు సంవత్సరాల నిరీక్షణ అనంతరం ఎట్టకేలకు రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది ఈ మూవీ. తాజాగా, ఈ సినిమాను మార్చి 8న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది మూవీ యూనిట్. దాంతో పాటు మూవీ మేకింగ్ వీడియోని కూడా పోస్ట్ చేశారు మేకర్స్.

విశ్వక్ సేన్ అఘోరా పాత్రలో కనిపించబోతున్న ఈ మూవీని హిమాలయాలు, వారణశి వంటి ప్రాంతాల్లో షూట్ చేసినట్లు సమాచారం. అడ్వెంచరస్ ఫాంటసీ ఫిల్మ్‌గా వస్తున్న ఈ మూవీలో చాందినీ చౌదరి మరో, అభినయ, మహ్మద్ సమద్, దయానంద్ రెడ్డి, హారికా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement