Friday, April 26, 2024

హైదరాబాద్ లో షూట్ రీస్టార్ట్ చేసిన విశాల్

కరోనా మహమ్మారి కారణంగా చాలావరకు సినిమా షూటింగ్ లను నిలిపివేశారు. ఇక ఇప్పుడు కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో షూటింగ్ లు పునః ప్రారంభం అవుతున్నాయి. తాజాగా తమిళ స్టార్ హీరో విశాల్ ‘విశాల్ 31’ సినిమా షూటింగ్ ప్రారంభించారు. హైదరాబాద్ లోని రామోజీ ఫిలింసిటీలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. నిజానికి కొన్ని నెలల ముందే ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేశారు. కానీ కరోనా కారణంగా ఆగిపోయింది.

అయితే ఈ సినిమా షూటింగ్ ను రీస్టార్ట్ చేసినట్లు స్వయంగా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు విశాల్. ‘విశాల్ 31’ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాము. జూలై చివరి నాటికి సినిమా షూటింగ్ పూర్తవుతుంది. కరోనా ప్రోటోకాల్స్ అనుసరిస్తూ షూటింగ్ జరుగుతోంది. పనిలోకి తిరిగి రావడం ఆనందంగా ఉంది… అంటూ విశాల్ అందుకు సంబంధించిన ఒక వీడియో లింక్ ను షేర్ చేశారు. ఈ సినిమాకు టి పి శరవణన్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement