Thursday, March 28, 2024

ప్రేమసౌధంకు స్వాగతం: తెరుచుకున్న తాజ్ మహల్ తలుపులు.. నిబంధనలు ఇవే!

కరోనా సెకండ్‌ వేవ్‌తో రెండు నెలల క్రితం మూతపడిన చారిత్రక పర్యటక కేంద్రం తాజ్‌ మహల్‌ తలుపులు మళ్లీ తెరుచుకున్నాయి. ప్రస్తుతం మహమ్మారి తీవ్రత తగ్గుతుండడంతో దేశవ్యాప్తంగా ఉన్న 3,693 చారిత్రక కట్టడాలు, 50 మ్యూజియంలు తిరిగి తెరవాలని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) నిర్ణయించింది. ఈ క్రమంలో తాజ్ మహల్ అందాలు చేసేందుకు పర్యాటకులకు అనుమతి ఇస్తున్నారు. అయితే, ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకున్న వారికే తాజ్ మహల్‌ను చూసేందుకు అనుమతి ఇస్తున్నారు. ఒక ఫోన్‌ నంబర్‌ ద్వారా గరిష్ఠంగా ఐదు టికెట్లు మాత్రమే బుక్‌ చేసుకునే వీలుంటుందని, విడుతలో 650 మందిని తాజ్‌ మహల్‌ సందర్శనకు అనుమతిస్తున్నట్లు అధికారులు తెలిపారు. స్మారక ప్రాంగణంలో రోజుకు మూడు సార్లు శానిటైజేషన్‌ పనులు చేపట్టనున్నట్లు చెప్పారు.

పర్యాటకులకు థర్మల్ స్క్రీనింగ్‌ పరీక్షలు చేయడంతో పాటు సామాజిక దూరం నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టారు. అలాగే, పర్యాటకులకు తాజ్‌లో ఏ వస్తువులను తాకేందుకు అనుమతి లేదని అధికారులు చెప్పారు. పర్యాటకులు కరోనా మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలని, మాస్క్‌ ధరించడం తప్పనిసరని ఏఎస్‌ఐ స్పష్టం చేసింది.

కాగా, దేశంలో కరోనా కేసుల పెరుగుదలతో ఏప్రిల్‌లో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ఆధీనంలోని స్మారక కట్టడాలు, మ్యూజియాలను మూసివేసింది. కరోనా మహమ్మారి దెబ్బకు దేశంలోని అన్ని పర్యాటక స్థలాలు మూతపడిన సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్ తో దేశంలో లక్షల చొప్పున కేసులు నమోదవడంతో తాజ్ మహల్ తో పాటు స్మారక చిహ్నాలు గత రెండు నెలలుగా పర్యాటకులకు అనుమతించడం లేదు.   ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన తాజ్ మహల్ సందర్శనకు వేసవిలో చాలా భారీ సంఖ్యలో వచ్చేవారు. అయితే లాక్ డౌన్ కారణంగా గత ఏడాదితోపాటు ఈ ఏడాది కూడా సందర్శకుల జాడ లేక తాజ్ మహల్ సందర్శకులపైనే ఆధారపడి జీవిస్తున్న అనేక మంది చిన్నా, పెద్ద వ్యాపారులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. కరోనా ఉద్ధృతి కూడా తగ్గడంతో పర్యాటక స్థలాలు తెరుచుకుంటున్నాయి.

ఇది కూడా చదవండి: ఏపీలో ఇకపై ఇంగ్లీష్ మీడియంలోనే డిగ్రీ కోర్సులు

Advertisement

తాజా వార్తలు

Advertisement