Wednesday, May 15, 2024

నెట్ ఫ్లిక్స్ లో విరూపాక్ష.. ఎప్పుడంటే

హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించిన చిత్రం విరూపాక్ష శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి పాజిటీవ్ టాక్ ని తెచ్చుకుంది. కాగా ద‌ర్శ‌కుడు సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వం వహించాడు. దర్శకుడు కొత్తవాడైనా ఎక్కడా తడబాటు లేకుండా… చాలా బాగా ప్రజెంట్ చేశారంటూ సినిమా చూసినవారు చెబుతున్నారు. ఈ సినిమా విడుదలైన కాసేపటి కే మూవీ ఓటీటీ రైట్స్ నెట్టింట టాపిక్ గా మారింది. ఇప్పటికే ఈ మూవీ ఓటీటీ రైట్స్ విషయంలో డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. విరూపాక్ష’ టైటిల్ కార్డ్స్ కంటే ముందు నెట్ ఫ్లిక్స్.. ఓటీటీ రైట్స్ ని దక్కించుకున్నట్లు వేశారు. దీంతో ఓటీటీ ప్లాట్ ఫాం ఏంటో అందరికీ తెలిసిపోయింది. మరో నాలుగు లేదంటే ఐదు వారాల్లో ఇది ఓటీటీకి వచ్చే అవకాశం ఉంది.నిజానికి యాక్షన్ థ్రిలర్స్ థియేటర్ లో చూస్తే కలిగే ఫీలింగ్ వేరే లెవల్ లో ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement