Tuesday, April 30, 2024

Vikram : యదార్థ సంఘటనల తంగలాన్‌

విక్రమ్‌ నటిస్తున్న పీరియాడిక్‌ చిత్రం ‘తంగలాన్‌’. పా.రంజిత్‌ రూపొందిస్తున్నారు. కేఈ. జ్ఞానవెల్‌ రాజా నిర్మిస్తున్నారు. పుట్టిన రోజు సందర్భంగా ‘తంగలాన్‌’ సినిమా నుండి ప్రత్యేక గ్లింప్స్‌ విడుదల చేశారు. సినిమా కోసం విక్రమ్‌ ఎంతగా శ్రమించారో ఇందులో చూపించారు.

- Advertisement -

ఈ సినిమా కోసం విక్రమ్‌ మారిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. దర్శకుడు పా.రంజిత్‌ మాట్లాడుతూ ఈ సినిమాను చరిత్రలో జరిగిన కొన్ని యాదార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నాం. ఈ విషయంలో విక్రమ్‌తో పాటు చిత్ర బృందం సహకరిస్తోంది. అని చెప్పారు. తంగలాన్‌లో పార్వతి తిరువోతు, మాళవిక మోహనన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని భారతీయ భాషల్లో విడుదల చేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement