Monday, April 29, 2024

Nara Rohit : నారా రోహిత్‌ సుందరకాండ

హీరో నారా రోహిత్‌ నటిస్తున్న 20వ చిత్రం ‘సుందరకాండ’. వెంకటేష్‌ నిమ్మలపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సంతోష్‌ చిన్నపొళ్ల, గౌతమ్‌ రెడ్డి, రాకేష్‌ మహంకాళి నిర్మిస్తున్నారు. వినోదాత్మక కథకథనంతో తెరకెక్కుతున్న చిత్రమిది. ప్రతి వ్యక్తికి సంబంధించి, జీవితంలో ఉండే అన్ని రకాల ఎమోషన్స్‌ని చూపించే విధంగా ‘సుందరకాండ’ ఉంటుందని చిత్ర బృందం అంటోంది.

ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో నారా రోహిత్‌ కూల్‌, క్లాసీ అవతార్‌లో కనిపిస్తున్నారు. సినిమా విడుదల తేదీని కూడా నిర్మాతలు ప్రకటించారు. సెప్టెంబర్‌ ఆరవ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుందని వెల్లడించారు. ఈ చిత్రంలో వృతి వాఘని నాయికగా నటిస్తోంది. శ్రీదేవి విజయ్‌కుమార్‌, నరేష్‌, వాసుకి కీలక పాత్రధారులు. ఛాయాగ్రహణం ప్రదీప్‌ ఎమ్‌ వర్మ, సంగీతం లియోన్‌ జేమ్స్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement