Thursday, May 16, 2024

బాలీవుడ్‌కు ‘అపరిచితుడు’

తమిళ హీరో విక్రమ్ కెరీర్ బెస్ట్ మూవీస్‌లో ముందు వరుసలో ఉండే సినిమా ‘అపరిచితుడు. ‘అన్యన్’ పేరుతో తమిళంలో రూపొందిన ఈ సినిమా తెలుగులో సైతం అద్భుతమైన ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. పర్సనాలిటీ డిజార్డర్‌తో బాధపడే పాత్రను విక్రమ్ అనితర సాధ్యమైన రీతిలో పోషించి మెప్పించాడు. రాము, రెమో, అపరిచితుడుగా మూడు వేరు వేరు పాత్రల్లో విక్రమ్ నట విశ్వరూపం చూపించిన ‘అపరిచితుడు’ మూవీ దర్శకుడిగా శంకర్‌కు కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది.

అయితే ఇన్నాళ్ళకు ఇప్పుడు ఈ సినిమా బాలీవుడ్ లో రీమేక్ కానుండడం విశేషం. ఒక ప్రముఖ సంస్థ అపరిచితుడు సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేయమని మంచి ఆఫర్ ఇచ్చిందట. దానికి శంకర్ అంగీకారం తెలిపాడని తెలుస్తోంది. రణవీర్ సింగ్ అపరిచితుడుగా నటిస్తాడని టాక్. ప్రస్తుతం శంకర్ ‘భారతీయుడు 2’, రామ్ చరణ్ సినిమా పనులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలూ పూర్తయిన తర్వాత అపరిచితుడు హిందీ వెర్షన్‌పై శంకర్ దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement