Thursday, May 2, 2024

విజయ్ దేవరకొండ వర్క్ ఫ్రొం హోమ్

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా పరిచయం అయిన విజయ్ దేవరకొండ… ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ గా మారిపోయాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాక్సర్ గా విజయ్ దేవరకొండ కనిపించనున్నాడు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమా టీజర్ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. కాగా తాజాగా విజయ్ దేవరకొండ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. యువర్ బాయ్ ఈజ్ బ్యాక్… వర్క్ ఫ్రొం హోమ్ అంటూ డబ్బింగ్ చెప్తున్న ఫోటోని పోస్ట్ చేశాడు. విజయ్ దేవరకొండ ఆ ఫోటోలో లో పేపర్ ని పట్టుకుని స్టైలిష్ గా కనిపించాడు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసిన అభిమానులు లైగర్ టీజర్ డబ్బింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి అందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement