Saturday, May 4, 2024

ఓటీటీ పార్టనర్​ని ఫిక్స్ చేసుకున్న విడుత‌లై.. ఏ ప్లాట్ ఫామ్ అంటే..

సంచలన దర్శకుడు వెట్రిమారన్ తాజాగా విడుదల చేసిన ‘విడుతలై పార్ట్ 1’ ప్రేక్షకులను మాత్రమే కాకుండా విమర్శకులను సైతం ఆకట్టుకుంది. తమిళ కమెడియన్ సూరి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం తెలుగులో కూడా ‘విడుదల పార్ట్ 1’గా విడుదలైంది. ఇప్పుడు ఈ చిత్రం OTTలో అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉంది. విజయ్‌ సేతుపతి, సూరి కీలక పాత్రల్లో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ ‘విడుతలై పార్ట్ 1’.

కాగా, ఇటీవలే ఈ సినిమా తమిళ ఓటీటీ హక్కులను జీ5 సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపించగా.. ఈనెల చివరి వారంలో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో స్ట్రీమింగ్ అవుతుందని జోరుగా ప్రచారం కూడా సాగింది. అంతేకాదు ఈ మూవీ ఏప్రిల్ 28న ZEE5లో ప్రీమియర్‌గా కానుందని సోషల్ మీడియాలోనూ వైరల్ అయింది. ఒకవేళ అదే నిజమైతే, తెలుగు వెర్షన్ ‘విడుదల పార్ట్ 1’ ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్ లోనూ విడుదల కానుంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ కాప్ యాక్షన్ డ్రామాలో భవాని శ్రీ మహిళా ప్రధాన పాత్ర పోషించారు. ఇందులో చేతన్, గౌతం వాసుదేవ్ మీనన్, ఇళవరసు, బాలాజీ శక్తివేల్, తమిళ్ తో పాటు ఇతరులు కీలక పాత్రలు పోషిమంచారు. ఈ చిత్రానికి ఇళయరాజా స్వరకర్త.

Advertisement

తాజా వార్తలు

Advertisement