Thursday, May 9, 2024

థియేటర్స్ లో మళ్ళీ వకీల్ సాబ్ ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రంవకీల్ సాబ్. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సూపర్ డూపర్ హిట్ ను సొంతం చేసుకుంది. అలాగే ఈ సినిమాలో నివేద థామస్, అంజలి,అనన్య కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా రిలీజ్ అయిన రెండు వారాలు మాత్రమే థియేటర్స్ లో ఆడింది.

ఆ తర్వాత నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. అయితే తాజా సమాచారం ప్రకారం మళ్లీ థియేటర్స్ లో ఈ సినిమా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను ఒక 300 థియేటర్లలో 50 శాతం సీటింగ్ తో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ఒకవేళ నిజమైతే పవన్ ఫ్యాన్స్ కు పండగ అనే చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement