Saturday, May 18, 2024

రాజుగారి గది4 కి ప్లాన్ సిద్ధం!!

బుల్లితెరపై యాంకర్ గా స్టార్ట్ చేసి దర్శకుడిగా నిలదొక్కుకున్నారు ఓంకార్. రాజు గారి గది సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన ఓంకార్… తన తమ్మున్ని హీరోగా చూపించారు ఇందులో ఓంకార్. ఆ తర్వాత ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు సీక్వెల్ గా రాజుగారి గది2 తెరకెక్కించారు ఓంకార్. ఇందులో నాగార్జున ,సమంత ప్రధాన పాత్రలు పోషించారు.

ఈ సినిమా కూడా పర్వాలేదనిపించింది. ఆ తరువాత రాజుగారి గది3 తీశారు. ఈ సినిమాలో అవికా గోర్ ప్రధాన పాత్ర పోషించింది. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు రాజుగారి గది4 సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడట. స్క్రిప్ట్ కూడా పూర్తయిందని తెలుస్తోంది.త్వరలోనే పూర్తి వివరాలు ప్రకటించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement