Monday, April 29, 2024

“ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్” ఫ‌స్ట్ షెడ్యూల్ కంప్లీట్.. హై-వోల్టేజ్ యాక్ష‌న్ & కామెడీ సన్నివేశాల‌ను షూట్ చేసిన మేక‌ర్స్

హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న మ‌రో మాస్ ఎంటర్‌టైనర్‌ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల కథానాయికగా క‌నిపించ‌నుంది. ఎనిమిది రోజుల పాటు సాగిన ఈ మూవీ ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్తి అయింది. 1000 మంది జూనియర్ ఆర్టిస్టులతో హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు షూట్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ యాక్ష‌న్ సీక్వెన్స్ ని ఫైట్ మాస్ట‌ర్స్ రామ్ లక్ష్మణ్ కొరియోగ్రఫీ చేశారు.

అలాగే, టీమ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్ సెట్‌లో కొన్ని వినోద-ఆధారిత స‌న్నివేశాల‌ను కూడా షూట్ చేసిన‌ట్టు తెలుస్తొంది. ఈ షెడ్యూల్‌లో నర్రా శ్రీను, చమ్మక్ చంద్ర, గిరి, టెంపర్ వంశీ, నవాబ్ షా, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్ పాల్గొన్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్‌లు భారీ ఎత్తున ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అశుతోష్ రానా, గౌతమి, నాగ మహేష్, టెంపర్ వంశీ ముఖ్య పాత్రలు పోషిస్తుండ‌గా.. గతంలో పవన్‌కి అద్భుతమైన ఆల్బమ్‌లు అందించిన రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఉస్తాద్ భగత్ సింగ్‌కి మ్యూజిక్ అందిస్తున్నాడు. మరి హరీష్ శంకర్ ఈసారి గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ ని అందిస్తాడో లేదో చూద్దాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement