Wednesday, May 1, 2024

అఖిల్ ‘ఏజెంట్’పై బిగ్ అప్డేట్.. మరికొద్ది సేప‌ట్లో ట్రైలర్‌ ఎనౌన్స్ మెంట్

టాలీవుడ్ యువ నటుడు అఖిల్ అక్కినేని ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటిస్తున్న మూవీ ఏజెంట్. స్పై థ్రిల్లింగ్ యాక్షన్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ భారీ పాన్ ఇండియన్ మూవీని అనిల్ సుంకర ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. హిప్ హాప్ తమిజా
సంగీతం అందిస్తున్న ఏజెంట్ నుండి ఇటీవల రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి. కాగా ప్ర‌స్తుతం ఈ మూవీ ట్రైలర్ కోసం అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

అయితే, ట్రైలర్ రిలీజ్ కి సంబందించిన అప్ డేట్ ని ఈ రోజు సాయంత్రం 7గం. 2ని.లకు అందించనున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం ఒక పోస్టర్ ద్వారా ప్రకటించారు. సాక్షి వైద్య హీరోయిన్ గా న‌టిస్తున్న‌ ఈ మూవీలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి ఏప్రిల్ 28న పలు భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement