Monday, April 29, 2024

ఐపిఎల్ – ఓట‌మి దిశ‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్ – 82/6

బెంగుళూరు- ఐపీఎల్ 16 వ సీజన్లో నేడు ఆర్ సి బి తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడింది.. ఈ మ్యాచ్ లో డిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లలో 174 పరుగులు చేసింది. డిసి 175 ప‌రుగులు విజ‌యం కోసం చేయాల్సి ఉండ‌గా,తాజాగా 12 ఓవ‌ర్లు ముగియ‌క‌ముందే ఆరు వికెట్లు ప్రాధాన‌ వికెట్లు కోల్పొయి పీక‌లోతు క‌ష్టాల‌లో ప‌డింది.. 21 ప‌రుగులు చేసిన అక్ష‌ర ప‌టేల్ ఆరో వికెట్ గా పెవిలియ‌న్ కు చేరాడు . ఈ వికెట్ వైశాక్ కు ల‌భించింది..ఇక అయిదు ప‌రుగుల చేసిన అభిషేక్ పోర‌ల్ ను అయిదో వికెట్ గా అక్ష‌ర ప‌టేల్ ఔట్ చేశాడు.. ఇక నాలుగో వికెట్ రూపంలోవార్న‌ర్ 19 ప‌రుగులు చేసి వైశాక్ బౌలింగ్ లో పెవిలియ‌న్ కు చేరాడు..కాగా డిసికి తొలి ఓవ‌ర్ నాలుగో బంతికి పృథ్వీ ర‌నౌట్ అయ్యాడు.. రావ‌త్ వేసిన అద్భుత త్రోకి పృథ్వీ ప‌రుగులేమి చేయ‌కుండా వెనుతిరిగాడు.. ఆ త‌ర్వాత వ‌న్ డౌన్ వ‌చ్చిన మార్ష్ ను పార్నెల్ ఔట్ చేశాడు.. ఇక య‌ష్ దూల్ ని సిరాజ్ ఎల్ బిగా ఇంటికి పంపాడు .. తాజాగా వార్న‌ర్ , ఆ త‌ర్వాత అశిషేక్ కూడా ఔట‌య్యాడు.. ఢిల్లీ క్యాపిట‌ల్స్ 13 ఓవ‌ర్లు ముగిసేనాటికి ఒక 6 వికెట్ల న‌ష్టానికి 82 ప‌రుగులు చేసింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement