Sunday, April 28, 2024

Urfi Javed : ఉర్ఫీ అరాచ‌కం..

ఉర్ఫీ జావేద్ పేరుకు పరిచయాలు అవసరం లేదు.. సినిమాల సంగతి ఏమో గానీ వింత డ్రెస్సులతో జనాలకు కోపాన్ని తెప్పిస్తుంది.. తన డ్రెస్సుల పై ఎన్ని విమర్శలు ఎదురైన తగ్గేదేలే అంటూ కొత్త ప్రయోగాలు చేస్తుంది.. విచిత్ర డ్రెస్సుతో జనాల్లోకి వస్తూ ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తుంది.

ఆమె చూసిన జనాలు చాలా మంది గొడవలకు దిగిన ఘటనలు కూడా అనేకం ఉన్నాయి.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ జనాలకు కోపాన్ని తెప్పిస్తుంది.. తాజాగా వెరైటీ డ్రెస్సులో ప్రత్యక్షం అయ్యింది.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

- Advertisement -

తాజాగా ఉర్ఫీ డ్రెస్సు అందరిని ఆకర్షిస్తుంది.. మొన్న ఏమో ఏకంగా డ్రెస్సులోనే విశ్వాన్ని చూపించింది.. ఇప్పుడేమో డ్రెస్సుకే ఫ్యాన్లు పెట్టింది.. ఆ డ్రెస్సుతో ముంబై వీధుల్లోకి వచ్చేసింది.. ఆ డ్రెస్సులో ఆమెను చూసిన వార్తంతా సెల్ఫీలు దిగుతూ రోడ్డుపై హంగామా చేస్తున్నారు.. చాలా వింతగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. మరికొందరు మాత్రం ఏంటి పాప ఫ్యాన్లు అక్కడ పెట్టావు బాగున్నాయి అంటూ కామెంట్ల రచ్చ చేస్తున్నారు.

ఈ ఫ్యాన్ల డ్రెస్సుకు సంబందించిన వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. అందులో ఉర్ఫీ పైన టాప్ కు రెండు ఫ్యాన్లు పెట్టింది.. వాటిని ఆన్ చెయ్యగానే తిరుగుతున్నాయి.. వాటిని చూసిన కెమెరామెన్లు అక్కడ ఎందుకు పెట్టావు అని అడిగితే సమ్మర్ స్పెషల్ అంటూ చెప్పుకొచ్చింది.. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.. డ్రెస్సు సంగతి ఏమో గానీ ఉర్ఫీ మాత్రం చాలా అందంగా ఉంది… ఒకసారి ఆ వింత డ్రెస్సును మీరు ఒక్కసారి చూసేయ్యండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement