Sunday, May 5, 2024

డెలివ‌రి కాక‌ముందే ఉపాస‌నకి.. ఊయ‌ల గిప్ట్

డెలివ‌రికి ముందే ఊయ‌ల‌ని గిప్ట్ గా పొందారు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ భార్య ఉపాసన . అందంగా, అద్భుతంగా ఉన్న ఊయల గిఫ్ట్ గా రావడంతో ఉపాసన సంతోషంలో మునిగిపోతోంది. ఇంతకీ ఆ ఊయల ఎవరు పంపారో వివరాల్లో తెలుసుకుందాం. ఉపాసన అనేక చారిటి కార్యక్రమాలు నిర్వహించడం చూస్తూనే ఉన్నాం. అనేక స్వచ్చంద సంస్థలకు గతంలో ఆమె సహాయ సహకారాలు, విరాళాలు అందించారు. అందులో ఒక సంస్థ అయిన ప్రజ్వల ఫౌండేషన్ లోని మహిళలు ఉపాసనకు ఈ ఊయలని గిఫ్ట్ గా పంపారు. ఈ ఊయల కంప్లీట్ గా చేతి కళతో మహిళలు స్వయంగా చేసినది. సెక్స్ ట్రాఫికింగ్ లో చిక్కుకుని బయట పడ్డ మహిళలని ఈ సంస్థ అందుకుంటుంది. ఆ మహిళలు ఉపాసనకు ఈ గిఫ్ట్ పంపారు. ఈ ఊయల బలం, ఆత్మగౌరవం, ఆశకి ప్రతీకగా తన బిడ్డకు గుర్తుండి పోతుంది అని ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ పెటింది. ప్రేమతో పంపిన గిఫ్ట్ కావడంతో ఉపాసన ఎంతో సంతోషంగా ఊయలని రిసీవ్ చేసుకుంది. ఆ దృశ్యాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement