Thursday, May 2, 2024

ఆర్ఆర్ఆర్ కి హైలెట్ అదేనట !!

దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాలో ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా కనిపించబోతున్నాడు. అయితే ఇద్దరు స్టార్ హీరోలని రాజమౌళి ఏవిధంగా చూపించబోతున్నాడా అని మొదటి నుంచి కూడా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా నిజానికి ఈ సినిమాలో పర్టిక్యులర్ గా 20 నిమిషాలు అద్భుతంగా ఉంటుందట. ఆ 20 నిమిషాల పోరాట సన్నివేశం
తోనే రాజమౌళి ఈ ఇద్దరు అగ్ర హీరోలు కలుపుతాడాని తెలుస్తోంది. అందుకే ఈ సన్నివేశం ఈ చిత్రానికి హైలెట్ కానుందట. ఇక ఈ సినిమాలో అజయ్ దేవగన్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాని డి.వి.వి.దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement