Friday, April 26, 2024

ఎపిలో క‌రోనా పేషేంట్ల‌కు ఆరోగ్య శ్రీ

అమరావతి, : ఆరోగ్య శ్రీ ఎంప్యానెల్‌ ఆస్పత్రుల్లో కోవిడ్‌ రోగులకు తప్పనిసరిగా 50 శాతం బెడ్లు ఇవ్వాలని, అంత కంటే ఎక్కువ రోగులు వచ్చినా విధిగా చేర్చు కోవాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి స్పష్టంచేశారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాల యంలో గురువారం కోవిడ్‌-19 నియంత్రణ, నివారణ, వ్యాక్సి నేష న్‌పై సమీక్ష నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్ప టికే రికార్డు స్థాయిలో పరీక్షలు చేస్తూ మన రికార్డులను మనమే బద్ధలు కొడుతు న్నామన్నారు. ఈనేపథ్యంలోనే కోవిడ్‌ చికిత్స కోసం అవసరం మేరకు బెడ్ల సంఖ్య మరింత పెంచాల్సి ఉందన్నారు. ఇందులో భాగం గా తాత్కాలిక ఎంప్యానెల్‌ ఆస్పత్రుల్లో కూడా 50 శాతం బెడ్లు కేటాయించాలిని చె ప్పా రు. కలెక్టర్లు నోటిఫై చేసిన నాన్‌ ఎంప్యానెల్‌ ఆస్పత్రు ల్లోనూ 50 శాతం బెడ్లు ఇవ్వా ల్సిందేనని పేర్కొ న్నారు. అందు కోసం ఆయా ఆస్ప త్రులను తాత్కా లికంగా ఎం ప్యానెల్‌ చేసి, వాటిలో సగం బెడ్లు అధికారులుగా మీరే కేటా యించండంటూ దిశానిర్దేశం చేశారు. కోవిడ్‌ చికిత్స కోసం తీసుకున్న అన్ని ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా చికిత్స చేయాలని వెల్లడించారు. ఇందులో ఎక్కడా తేడా రాకూడదని స్పష్టంచేశారు. ప్రభుత్వ, ఆరోగ్యశ్రీ ఎంప్యానెల్‌లో ఉన్న వాటితో సహా, అన్ని ఆస్పత్రుల్లో కోవిడ్‌ చికిత్స ఒకేలా ఉండా లని ఆదేశించారు. ఆరోగ్య శ్రీ ఆస్పత్రిలో ఎన్ని బెడ్లు ఉన్నా యి. వాటిలో ఎన్ని కోవిడ్‌ రోగులకు ఇసు ్తన్నారు.. అన్నదానిపై పూర్తి స్పష్ట త ఉండాని చెప్పారు. దాని వల్ల ఆస్పత్రుల్లో ఎన్ని బెడ్లు కోవిడ్‌ రోగులకు ఇస్తున్నా మన్నది మనకు అర్ధమౌతుందన్నారు. ఆ విధంగా ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రైవేటు- ఆస్ప త్రులు అన్నింటిలో కలిపి కోవిడ్‌ రోగు లకు మొ త్తం ఎన్ని బెడ్లు ఉన్నా య న్నది తెలు స్తుం దన్నారు. కాల్‌ సెం ట ర్‌104 కు ఫోన్‌ వస్తే, ఆ రోగి ఉన్న ప్రాం తాన్ని బట్టి, ఆ జిల్లాకు మెసేజ్‌ వెళ్తుందని తెలిపారు. వెంటనే కలె క్టర్‌, జిల్లా యం త్రాంగం స్పందించి, ఆయా ఆస్ప త్రులలో రోగులను చేర్పిం చాలని మరోమారు పునరుద్ఘాటిం చారు. ఏ ఆస్పత్రి కూడా రోగుల నుంచి ఇష్టాను సారం ఫీజులు వసూలు చేయ కుండా చూడాలని చెప్పారు. కోవిడ్‌ రోగులకు పూర్తిగా ఉచితంగా వైద్య సేవలు అందించాలన్నదే ప్రభుత్వ ధ్యేమని, దానికి అనుగుణంగా అందరూ పని చేయా లని చెప్పారు.అన్ని కోవిడ్‌ ఆస్పత్రుల వద్ద కోవిడ్‌ కేర్‌ సెంటర్లు హ్యాంగర్లు పెట్టి ఏర్పాటు- చేస్తే బాగుంటు-ందని తెలిపారు. ఆస్పత్రి వైద్యులే అక్కడ కూడా సేవ లందిస్తారని చెప్పారు. అక్కడ అన్ని వసతులు తప్పనిసరిగా ఉండేలా చూడాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement