Sunday, April 28, 2024

Trisha: హీరోయిన్ గా 20 ఏళ్ల ప్ర‌స్థానం.. అయినా త‌గ్గ‌ని దూకుడు…

రెండు దశాబ్దాలుగా సౌత్ ఆడియన్స్ ని తన మాయలో పడేసిన సౌత్ క్వీన్ అందాల భామ త్రిష కృష్ణన్ ఇప్పటికీ మొదటి సినిమా నీ మనసు నాకు తెలుసు సినిమాలో ఎలా ఉందో ఇప్పటికీ అలానే ఉంది. ఆ సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన లియో వరకు త్రిష సినిమాలో ఉంటే ఆ స్క్రీన్ మీద ఉండే గ్లామరే వేరు అన్నట్టుగా తన సత్తా చాటుతూ వస్తుంది.

ఈ 20 ఏళ్ల కాలంలో ఎంతోమంది హీరోయిన్స్ వచ్చారు వెలుగు వెలిగారు ఫేడవుట్ అయ్యి వెళ్లిపోయారు. కానీ త్రిష ఇప్పటికీ అదే ఫాం అదే క్రేజ్ తో కొనసాగుతుంది. కోలీవుడ్ లో సూపర్ ఫాం లో ఉన్న త్రిషకు ఈమధ్య తెలుగు నుంచి కూడా ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.అసలైతే ఆచార్య సినిమాలోనే త్రిష హీరోయిన్ గా చేయాల్సి ఉన్నా అది కుదరలేదు. ఇప్పుడు మెగా 156లో త్రిష నటిస్తుందని టాక్. ఇదే కాకుండా బాలకృష్ణ బాబీ కాంబో సినిమాలో కూడా త్రిషని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ రెండు సినిమాలతో టాలీవుడ్ లో సత్తా చాటాలని చూస్తుంది త్రిష.

Advertisement

తాజా వార్తలు

Advertisement