Thursday, November 7, 2024

Nizamabad – సంఘ పటిష్టతకు అందరు సమిష్టిగా కృషి చేయాలి…

నిజామాబాద్ సిటీ, జనవరి (ప్రభ న్యూస్):*సంఘ పటిష్టతకు అందరు సమిష్టి గా కృషి చేయాలని మున్నూరు కాపు ప్రభుత్వ ఉద్యోగుల,విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఏనుగుల సత్య నారాయణ పటేల్ అన్నారు. సభ్యులందరినీ సంఘటిత పరుచుకొని సంక్షేమ కార్య క్రమాలు ప్రగతి బాట నడిపిం చేందుకు అందరూ కృషి చేయా లని పిలుపనిచ్చారు

.ఆదివారం నగరంలోని న్యాల్ కల్ రోడ్డు వద్ద గల మున్నూరు కాపు కళ్యాణ మండపంలో మున్నూరు కాపు ప్రభుత్వ ఉద్యోగుల,విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశము నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గౌరవ అధ్య క్షులు ఏనుగుల సత్యనారా యణ పటేల్, ధర్మపురి సురేం దర్, రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ బాల శ్రీనివాస్ పటేల్ విచ్చేసి నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్య క్రమానికి జిల్లా వ్యాప్తంగా 300 మంది సభ్యులు సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్ర కార్యవర్గానికి వివిధ జిల్లాల ప్రతినిధులు హాజర య్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement