Sunday, April 28, 2024

Kollywood : చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో విషాధం… కోలీవుడ్​ న‌టుడు మృతి…

చిత్ర పరిశ్రమలో వరుస విషాధం నెల‌కొంది. ప్రముఖ నటుడు గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఇక ఆయన హఠాన్మరణం సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నింపింది.కోలీవుడ్ నటుడు ‘డేనియల్ డేనియల్’ బాలాజీ (48) హఠత్తుగా కన్నుముశారు.

- Advertisement -

దాదాపు రెండు దశాబ్దాలకు పైగానే సినిమాల్లో నటించి విశేషమైన గుర్తింపును తెచ్చుకున్న డానియెల్ బాలాజీ గత రాత్రి గుండెపోటుకు గురయ్యారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు గమనించే లోపే ఆయన ప్రాణాలు కోల్పోయారని తెలిసింది. అయినప్పటికీ ఆయనను దగ్గరలోని ఆస్పత్రికి తరలించగా.. డానియెల్ మరణాన్ని అక్కడి వైద్యులు ధృవీకరించారు.

బాలాజీ మృతి పలువురు సినీ ప్రముఖులు, అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మృతిపట్ల పలువురు సంతాపం తెలియజేస్తున్నారు. కాగా బాలాజీ తన కెరీర్‌లో తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 50కి పైగా సినిమాలు చేసి అలరించాడు.

అయితే సినిమాల్లో ఎక్కువగా విలన్ పాత్రలతో అందరినీ ఆకట్టుకున్నాడు. తెలుగులో ఎన్టీఆర్ హీరోగా నటించిన సాంబ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత వెంకటేష్ నటించిన ఘర్షణ, రామ్ చరణ్ నటించిన చిరుత, నాగచైతన్య నటించిన సాహసం శ్వాసగా సాగిపో, నాని నటించిన టక్ జగదీష్ వంటి సినిమాల్లో నటించి మెప్పించాడు.

అయితే తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా.. తన యాక్టింగ్‌తో ఎంతో మంది ప్రేక్షకుల్ని అలరించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇకపోతే బాలాజీ 2001లో ‘చితి’ అనే సీరియల్‏ ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సీరియల్‌లో అతడు డేనియల్ పాత్రలో కనిపించి మెప్పించాడు.

ఈ సీరియల్ అనంతరం తన యాక్టింగ్‌కు మెచ్చి సినిమాలో మంచి అవకాశం వచ్చింది. 2002లో రొమాంటిక్ డ్రామా ఏప్రిల్ మధతిల్ అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఇక అక్కడ నుంచి తిరిగి వెనక్కి చూసుకోలేదు. పలు చిత్రాలతో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నాడు.

అనంతరం చాలా సినిమాల్లో నెగెటివ్ రోల్స్‌ చేశాడు. కాగా డేనియల్ బాలాజీ మరెవరో కాదు.. ప్రముఖ దర్శకుడు, నిర్మాత సిద్దలింగయ్య సోదరి కుమారుడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement