Sunday, December 1, 2024

Genelia : బొమ్మ‌రిల్లు బొమ్మ‌….

సీనియర్ నటి జెనీలియా లేటెస్ట్ లుక్ నెట్టింట వైరల్ గా మారింది. ట్రెడిషనల్ లుక్ లో మెరిసిన ఆమె ఫ్యాషన్ సెన్స్ ఇంట్రెస్టింగ్ గా మారింది. కొత్త ట్రెండ్ కు వెల్కమ్ చెప్పినట్టుగా కనిపిస్తోంది. కొన్నేండ్లు టాలీవుడ్ లో హీరోయిన్ జెనీలియా వెలుగొందింది. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. తనకంటూ ఇండస్ట్రీలో స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది.

బాలీవుడ్ నటుడు, ప్రొడ్యూసర్ రితీష్ దేశ్ ముఖ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత ఇక పూర్తిగా అక్కడే సెటిల్ అయ్యింది. హిందీలో కొన్ని సినిమాలు చేస్తోందే కానీ.. సౌత్ వైపు చూడటం లేదు. ఇదిలా ఉంటే.. ఈ సీనియర్ హీరోయిన్ సోషల్ మీడియాలో మాత్రం తెగ సందడి చేస్తూనే వస్తోంది. తన గురించిన అప్డేట్స్ ను అందిస్తూ వస్తోంది. ఈక్రమంలో జెనీలియా చెక్కుచెదరని అందంతో ఆకట్టుకుంటూనే వస్తోంది.

- Advertisement -

అదిరిపోయే అవుట్ ఫిట్లతో మెస్మరైజ్ చేస్తోంది. ఇంకా యంగ్ హీరోయిన్లకు పోటీనిచ్చే అందంతో అదరగొడుతోంది. తాజాగా జెనీలియా ట్రెడిషనల్ లుక్ లో మెరిసింది. అయితే సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ పెళ్లి కూతురిలా తల నిండా ఆకర్షణీయమైన ఆభరణాలను ధరించడం ఆసక్తికరంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement