Thursday, May 2, 2024

తిరగబడరసామీ కి ఆల్‌ ది బెస్ట్‌

రాజ్‌ తరుణ్‌ హీరోగా ఎ ఎస్‌ రవికుమార్‌ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘తిరగబడరసామీ’. మల్కాపురం శివ కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ఈ చిత్రం టీ-జర్‌ విడుదల చేశారు.టీ-జర్‌ ఆవిష్కరణ తర్వాత నిర్మాత దిల్‌ రాజు మాట్లాడుతూ ”ఈ టీ-జర్‌ చూస్తుంటే అండర్‌ ప్లే పాత్ర చేసి ఫైనల్‌ గా తిరగబడరసామీ అని -్లకె-మాక్స్‌లో ఇరగదీసినట్లు- అర్ధమవుతుంది రాజ్‌ తరుణ్‌, రవి కుమార్‌ కమ్‌ బ్యాక్‌. టీ-ం అందరికీ ఆల్‌ ది బెస్ట్‌” తెలిపారు.

హీరో రాజ్‌ తరుణ్‌ మాట్లాడుతూ ”దర్శకుడు రవికుమార్‌ చౌదరి గారు ఈ సినిమాతో నాలో కొత్త కోణం చూపించారు. నేను చిన్నచిన్నగా తప్పితే యాక్షన్‌ పెద్దగా ఎపుడూ చేయలేదు. ” అన్నారు.

ఏఎస్‌ రవికుమార్‌ చౌదరి మాట్లాడుతూ ”కొన్ని సంవత్సరాల గ్యాప్‌ తర్వాత నాకు మళ్ళీ రీబర్త్‌ ఇస్తున్న మా నిర్మాత శివకుమార్‌ గారికి ధన్యవాదాలు. ” అని తెలిపారు.

నిర్మాత మల్కాపురం శివకుమార్‌ మాట్లాడుతూ ” నేను చేసిన చిత్రాల్లో సూర్య వెర్సస్‌ సూర్య నా మనసుకు దగ్గరైన చిత్రం. ఆ టీ-ంతో మరో పది సినిమాలు చేయడానికి సిద్ధంగా వుంటాను. అదే విధంగా ఈ సినిమా టీ-ంతో కూడా రెడీగా వుంటాను. కొబ్బరికాయ కొట్టినప్పుడు ఎంత సంతోషంగా ఉంటామో గుమ్మడి కాయ కొట్టినప్పుడు కూడా అదే సంతోషం వుంటే సినిమా ఖచ్చితంగా హిట్‌ అవుతుంది. అని తెలిపారు.

- Advertisement -

ఇంకా ఈ కార్యక్రమంలో బెక్కం వేణుగోపాల్‌, మన్నారా చోప్రా , దర్శకుడు సముద్ర, తాగుబోతు రమేష్‌ తదితరులు మాట్లాడారు

Advertisement

తాజా వార్తలు

Advertisement