Sunday, April 28, 2024

ఆది పురుష్ నుంచి ఈ సారి వచ్చేది అతనే !!

ఓం రౌత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆదిపురుష్. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడు గా కనిపించబోతున్నాడు. అలాగే బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా కనిపించబోతున్నాడు. కృతిసనన్ సీతగా గా కనిపించబోతోంది. ఇక ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా సినిమాపై అంచనాలు అంతకంతకీ రెట్టింపు అవుతున్నాయి. ఇప్పటికే ఒక్కో పాత్ర ని రివీల్ చేస్తూ వస్తున్న చిత్ర యూనిట్… ఇప్పుడు మరో భారీ అనౌన్స్మెంట్ కు రెడీ అవుతోందట.

ఈ రామాయణంలో పవర్ ఫుల్ పాత్ర అయినటువంటి హనుమంతుని పాత్రపై ఈసారి అప్డేట్ ఉండవచ్చని తెలుస్తోంది. కాగా ఎప్పుడు రివీల్ చేస్తారు అనేది దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే ఈ చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement