Saturday, May 4, 2024

వధువు కోసం వరుడు స్టార్ట్ అయ్యాడు!!

టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. అయితే మొన్నటి వరకు కరోనా కారణంగా వాయిదా పడ్డ సినిమాలు ఇప్పుడిప్పుడే షూటింగ్ లను రీస్టార్ట్ చేస్తున్నాయి. అందులో భాగంగానే నాగశౌర్య నటిస్తున్న వరుడు కావలెను సినిమా షూటింగ్ కూడా రీస్టార్ట్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. సోషల్ మీడియా లో వరుడు కావలెను సినిమా షూటింగ్ ప్రారంభం చేస్తున్న పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

మొత్తం నాగశౌర్య ఒకేసారి మూడు సినిమాల షూటింగ్ లను జరుపుతున్నాడు. అందులో మొదటగా తన 20వ సినిమా లక్ష్య ఫస్ట్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అలాగే పోలీసువారి హెచ్చరిక తో పాటు లేడీ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న వరుడు కావలెను సినిమాను పూర్తి చేస్తున్నాడు. ఈ వరుడు కావలెను సినిమాలో నాగ శౌర్య సరసన రీతూవర్మ నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్ పై సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement