Thursday, April 25, 2024

పవన్ సినిమాలో ఫిల్మ్ మేకర్ గా వివి వినాయక్ !

సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ అయ్యప్పనుమ్ కొషియమ్ రీమేక్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ తో పాటు రానా కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కథ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ ఓ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. అలాగే రానా రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు.

ఇదిలా ఉండగా ఈ సినిమాపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమాలో డైరెక్టర్ వి.వి.వినాయక్ ఓ పాత్ర పోషిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై వి.వి వినాయక్ స్పందించారట. సన్నిహితులతో చెబుతూ అవును నిజమే పవన్ సినిమాలో నేను కూడా ఓ పాత్ర పోషిస్తున్నా అని అది కూడా ఓ ఫిలిమ్ మేకర్ గా కనిపిస్తాను అంటూ చెప్పినట్లు సమాచారం. మరి ఇందులో లో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement