Monday, April 29, 2024

సూర్య ‘జై భీమ్’ స్టోరీ ఇదే!!

ఆకాశమే నీ హద్దురా సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు తమిళ స్టార్ హీరో సూర్య. ప్రస్తుతం సూర్య వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు. వాటిలో జై భీమ్ సినిమా ఒకటి. ఇక ఈ సినిమాలో సూర్య ఓ లాయర్ పాత్రలో కనిపించబోతున్నాడు. కొన్ని నిజ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రాసినట్లుగా తెలుస్తోంది. 1993లో తమిళనాడులో గిరిజన యువతి కోసం సీనియర్ అడ్వకేట్ చంద్రు న్యాయపోరాటం చేశారు.

యువతి కోసం పోరాటం చేసిన అడ్వకేట్ చంద్రు దేశ వ్యాప్తంగా అప్పట్లో చర్చనీయాంశంగా మారాడు. ఆ సమయంలో మీడియా లో ప్రధానంగా చంద్రు గురించి వార్తలు వచ్చాయి. ఇక ఆ పోరాటంను కాస్త ఇప్పుడు కమర్షియల్ హంగులతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement