Sunday, April 28, 2024

పుష్ప సినిమాలో అనసూయ గెటప్ ఇదే…ఫొటోస్ వైరల్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పుష్ప రాజ్ గా కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమాలో రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. మరోవైపు మలయాళం స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈ సినిమాలో జబర్దస్త్ యాంకర్ అనసూయ కీలక పాత్రలో నటిస్తుంది. కాగా ఈ సినిమాలో అనసూయ గెటప్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఈ గెటప్ లో అనసూయ కాస్త డిఫరెంట్ గా కనిపిస్తోంది. ఇందులో అనసూయ సునీల్ భార్య గా నటించబోతుందని సమాచారం. కాగా ఈ సినిమాను క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement